కుభీర్ : నిర్మల్ ( Nirmal ) జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం గోడ కూలి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి (Students Injure) . జిల్లాలోని కోవూరు మండలం అంతర్నీ గ్రామంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలో ముగ్గురు విద్యార్థులు ఆడుకుంటుండగా గోడకూలి ఇటుకలు మీదపడ్డాయి.
ఈ ఘటనలో ప్రేమ్(7), లక్ష్మణ్ చందా మండలం తిర్పెల్లి గ్రామానికి చెందిన సాయికుమార్ (6) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మరో విద్యార్థి అభినయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని 108 అంబులెన్సులో భైంసా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలను కూల్చివేయాలని అధికారులు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు.