ఉట్నూర్, జూన్ 29: ఇంద్రవెల్లి మండలంలోని ధ నోర గ్రామంలో ఇటీవల బావిలో ఓ మహిళ మృత దేహం దొరికింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న సదరు మహిళపై ముగ్గురు కర్కశకులు లైంగిక దాడి చేసి హత్య చేసినట్లుగా తేల్చారు. వివరాలిలా ఉన్నాయి. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ వివరాల ప్రకారం.. భిక్షాటన చేస్తూ జీవించే ఓ మహిళ ఈనెల 20 ధనోర గ్రా మంలోని తన చెల్లెలి ఇంటికి వచ్చింది. సాయంత్రం తిరిగి వెళ్లేందుకు బయల్దేరింది. అదే గ్రామానికి చెంది న సుముకారావు సంతోష్ ఆమెతో అసభ్యంగా ప్రవ ర్తించాడు. గమనించిన పసారే సంతోష్, ఎస్కే ఖదీర్ తొలుత అతడిని మందలించారు. తర్వాత ముగ్గురు ఒక్కటై ఆమెను ఒక పశువుల కొట్టంలోకి తీసుకెళ్లారు.
ఆమె కేకలు వేయడంతో, స్థానికులు అక్కడికి చేరుకొ ని బెదిరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి న ఆమెపై కొంత దూరం వెళ్లాక, ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఆ తర్వాత ఆమె గ్రామంలో చెబుతానని బెదిరించగా, సదరు మహిళను సుమకారపు సంతోష్ బండరాయితో కొట్టి వ్యవసాయ బావిలో పడేశాడు. నాలుగు రోజుల తర్వాత బావిలో కుళ్లిపోయి కనిపించడంతో, పంచాయతీ సెక్రటరీ వెంకటరమణ గుర్తుతెలియని శవంగా ఇంద్రవెల్లి పీఎస్లో ఫిర్యాదు చేశా రు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులు గు ర్తించడంతో పాటు ముగ్గురిపై అనుమానం వ్యక్తం చే శారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. నింది తులపై సామూహిక లైంగికదాడి, హత్య, ఎస్టీ,ఎస్సీ కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. ఇన్చార్జి సీఐ ప్రే మ్ కుమార్, ఎస్ఐ సునీల్ ఉన్నారు.