మంచిర్యాలటౌన్, జనవరి 31 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా తౌటం శివాజీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 2019 గ్రూప్-2 అధికారి అయిన ఆయన ఇప్పటి వరకు సెక్రేటేరియట్లో ఏఎస్‌వోగా పనిచేశారు. తాజాగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు.
ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన మారుతీ ప్రసాద్ లక్షెట్టిపేట మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన శివాజీని డీఈ మసూద్, ఏఈ రాజేందర్, ఏవో అనితాదేవి, ఆర్వో శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్ విజయ్‌కుమార్, నస్పూరు కమిషనర్‌గా పనిచేసిన సతీష్, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
మందమర్రి, జనవరి 31 : మందమర్రి ము న్సిపాలిటీ కమిషనర్‌గా తుంగపిండి రాజలిం గు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రా మగుండం నగర పాలక సంస్థలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన రాజలిం గు మందమర్రి మున్సిపాలిటీకి బదిలీపై వచ్చా రు. కార్యాలయ సిబ్బంది ఆయనను సన్మానించారు. నూతన కమిషనర్ రాజలింగును మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.
డీఈ సుమతి, ఏఈఈ ఎస్.సందీప్, ఆర్ఐ కృష్ణప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, సిబ్బంది ఏ.రాణి, లక్ష్మీరాజు, బంగారు శ్రీనివాస్, రాజేందర్, కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు కొంగల తిరుపతి రెడ్డి, బోరిగం వెంకటేశ్, దుర్గం ప్రభాకర్, భట్టు రాజ్‌కుమార్, తోట సురేందర్, మంద తిరుమల్ రెడ్డి, అవునూరి పోషం, సాదుల విద్యాసాగర్ పాల్గొన్నారు.