అడవి తల్లి ఒడిలో గిరిజనులు, గిరిజనేతరులు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నారు. జీవనోపాధి కోసం దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అడవులను నరికి సాగు చేసుకుంటుంటే పోలీసులు, రెవెన్యూ శాఖల వారితో నిత్యం ఘర్షణలు జరుగుతూ ఉండేవి. విసుగు చెంది పోడు భూములపై హక్కుల కోసం ఆందోళనలు చేసినా.. ఏండ్లపాటు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టించుకున్న పాపాన పోలేదు.
కేసులు నమోదు చేసి అవస్థలపాలు చేసిన సందర్భాలు కోకొల్లలు. దీనిని గమనించిన బీఆర్ఎస్ సర్కారు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పోడు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు అందించింది. దీనికితోడు రైతుబంధు, రైతుబీమా కల్పించి ఆదుకుంటున్నది. తాజాగా.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో గిరిజనేతరులకు కూడా పోడుపై హక్కులు కల్పిస్తామని పేర్కొన్నారు. అర్ధ శతాబ్దపు ఆకాంక్షలు నెరవేరనుండగా, గిరిజనేతరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– మంచిర్యాల, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పొడునే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న తమకు ఆ భూములపై హకు లు కల్పించాలనే గిరిజన, ఆదివాసుల చిరకాల స్వప్నాన్ని తెలంగాణ సరారు సాకారం చేసిం ది. దశాబ్దాలపాటు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా గత పాలకులు పట్టించుకోలేదు. భూమిపై హకులు కావాలి అన్న రైతుల చేతికి సంకెళ్లు వేయించినయ్. మకిలు ఇరగగొట్టి జైళ్లలో కూర్చోబెట్టినయ్. పోడు రైతుల కష్టాలు ఎరిగిన సీఎం కేసీఆర్ సారు. గిరిజన, ఆదివాసులకు పోడు భూములపై హకులు కల్పించారు.
జల్, జంగల్, జమీన్ నినాదం ఇచ్చిన ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రం భీమ్ జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా పొడు పెట్టాలు పంపిణీ చేసి చూపించారు. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయడంతోపాటు పట్టాలు పొందిన పోడు రైతులకు రైతుబంధు కూడా ఇచ్చిండు. ఇప్పుడు దశాబ్దాలుగా పొడు సాగు చేస్తున్న గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాడు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చిండు. దీనిపై పొడు సాగు చేస్తున్న గిరిజననేతరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనసున్న కేసీఆర్ మా మనసులో ఉన్న ఆశను తెలుసుకొని పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడం గొప్ప విషయం అని వెయినోళ్ల పొగుడుతున్నారు. పట్టాలు రావాలంటే మరోసారి బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని స్పష్టం చేస్తున్నారు.