Urea | నెన్నెల, జులై 2: జిల్లాలో సాగుచేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచిర్యాల జిల్లా వ్యసాయ అధికారి కల్పన తెలిపారు. ఆమె నెన్నెల లోని ఎరువులు దుకాణాల వద్ద మంగళవారం కొందరు రైతులు క్యూ లైన్ లో ఘర్షణకు దిగారు. దీంతో ఆమె బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా రైతులకు కావాల్సిన యూరియా ను అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ఇప్పుడే విత్తనాలు వేస్తున్నారని, ఎరువులు వేసే సమయం రాలేదన్నారు.
రైతులు ముందస్తుగా యూరియా ను కొనుగోలు చేసి పంటపోలళ్లలో నిల్వ చేసుకుంటున్నారని, దానికోసం అందరు రైతులు ఒకేసారి రావడం తో కొంత ఇబ్బంది పడ్డారని చెప్పారు. జిల్లా రైతులకు సరిపడా యూరియా ఆయా కేంద్రాలకు విడుతల వారీగా అందజేస్తున్నామని తెలిపారు. ప్రతీ నెల రైతులకు అవసరమున్నా ఎరువులు హకా, మార్క్ ఫేడ్ ద్వారా అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ డీలర్ల వద్ద సైతం యూరియా ఉందని చెప్పారు.ఇప్పటి వరకు జిల్లాలో 7000వేల మెట్రిక్ టన్నులు అందిచామని, ఇంకా 5000 వేల టన్నులు వస్తుందని పేర్కొన్నారు. యూరియా ను బ్లాక్ చేసినా, అధిక ధరలకు అమ్మినా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట ఏడీఏ సురేఖ, ఏ వో సృజన ఉన్నారు.