మంచిర్యాల, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ కాస్త తగ్గింది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ& ఇదే సమయంలో దొంగతనాలు పెరిగాయి. రేప్, కిడ్నాప్ కేసులు సైతం ఎక్కువయ్యాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ విడుదల చేయనున్న వార్షిక నివేదికలో ఈ అంశాలను పొందుపరిచారు.
రాత్రివేళ జరిగే దొంగతనాల సంఖ్య కూడా గతేడాదితో పోలిస్తే కాస్త పెరిగింది. మధ్యాహ్నం వేళ దొంగతనాలు స్వల్పంగా తగ్గాయి. ఇకపోతే రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా మారాయి. ఈ ఏడాది 123 మంది మృత్యువాత పడగా, 258 మందికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలో చీటింగ్ చేసిన కేసులు దాదాపు గతేడాది మాదిరిగానే నమోదయ్యాయి. మొత్తంగా గతేడాది 2023లో 5115 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది(నవంబర్ వరకు) 4,455 కేసులు అయ్యాయి.