చెన్నూరు రూరల్ : మండలంలోని కిష్టంపేట రైతు వేదికలో ( Rythu Vedika) దొంగతనం (Theft ) జరిగింది. బుధవారం రాత్రి రైతు వేదిక కార్యాలయం తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. కార్యాలయంలోని కంప్యూటర్ , స్పీకర్లను దొంగిలించారు. గురువారం రైతులు గమనించి వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవసాయ విస్తరణ అధికారి సాయికృష్ణ చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చెన్నూర్ సీఐ , పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.