కుమ్రంభీం ఆసిఫాబాద్ : బియ్యం అక్రమ రవాణా విషయాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో కాగజ్ నగర్ (Kagajnagar) పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన అక్రమ్‌ఖాన్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. మంగళవారం ఉదయం మూడు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 208 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ( Ration Rice) సిర్పూర్(టీ) పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.
అయితే పోలీసులకు సమాచారం ఇచ్చాడన్న నెపంతో నిన్నరాత్రి బియ్యం అక్రమ రవాణాదారులు అక్రమ్ఖాన్ను అటకాయించి చితకబాదారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా (Police Informer) మారావంటూ బూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపిస్తూ తీవ్రంగా కొట్టారని బాధితుడు అక్రమ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగాగాయపడ్డ అక్రమ్ ఖాన్ ప్రస్తుతం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడని వివరించారు.