సోన్, అక్టోబర్ 25: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను ఆదరిస్తున్నారని, సీఎంకు అండగా నిలవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
నిర్మల్‌లోని మంత్రి నివాస భవనంలో సోన్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన సుమారు వంద మంది టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. వారికి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సోన్ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ మోహినొద్దీన్, సర్పంచ్ టీ వినోద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జక్క రాజేశ్వర్, లెంక బుచ్చన్న, నాయకులు దాసరి శ్రీనివాస్, నవకాంత్, గంగాధర్ పాల్గొన్నారు.