తాండూర్ : ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామపంచాయతీ పరిధి కొమ్ముగూడెంకు చెందిన పెరుగు రవిప్రసాద్ ఏ కేటగిరీలో మెడికల్ సీటు ( Medical Seat ) సాధించాడు. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు పెరుగు లింగయ్య, పాపమ్మ దంపతుల కుమారుడు రవిప్రసాద్ ( Ravi Prasad ) హైదరాబాద్‌లోని ఎస్. ఆర్ కళాశాల మల్లంపేట్ బ్రాంచ్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే మెడికల్ సీటు సాధించాడు.
ఈ సందర్భంగా విద్యార్థి రవిప్రసాద్‌ను కళాశాల యజమాన్యం జీఎం భగవాన్ రెడ్డి, జోనల్ ఇన్చార్జి అమరేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ వాసు, ఏజీఎం స్వరూప్, అడ్మిషన్ ఇన్చార్జిలు రాజ్ కుమార్, శ్రీకృష్ణదేవరాయలు, సురేష్ అభినందించారు.