కడెం : మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామ ( Lakshmisagar village ) సమీపంలో కబ్జాకు (Encroached ) గురవుతున్న గ్రామ చెరువును కాపాడాలని మత్స్యకార సంఘం నాయకులు, రైతులు కోరారు. శుక్రవారం చెరువు వద్ద నిరసన తెలిపిన అనంతరం తహసీల్దార్ ప్రభాకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
మత్స్యకార సంఘం నాయకుడు సత్యం మాట్లాడుతూ గ్రామ సమీపంలోని చెరువును కొందరు వ్యక్తులు కబ్జా చేసి పంటలు పండిస్తున్నారని, అయితే మత్స్యకారులకు జీవనాధారమైన చెరువును కబ్జా చేయడం వల్ల తమ జీవన మనుగడకు ఇబ్బందిగా మారిందని వాపోయారు. కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు, రైతులు, తదితరులున్నారు.