కోటపల్లి : పోలీస్ వ్యవస్థ ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పాలన కొనసాగించలేరని బీఆర్ఎస్వీ ( BRSV) రాష్ట్ర కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ ( Vidyasagar ) అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్వీ నాయకులు మారిశెట్టి విద్యాసాగర్, అసంపల్లి అనిల్, బాపు నాయక్ లను ముందస్తు అరెస్ట్( Arrest) చేశారు.
ఈ సందర్బంగా మారిశెట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు జడిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగమాగం అవుతూ బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తుందని ఆరోపించారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేవలం 12వేలు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని విమర్శించారు.
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి మోసం చేశాడని అన్నారు. కాలేజీ విద్యార్థులకు స్కాలర్ షిప్లు, ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.