నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాల తో ఆరు ప్లాట్లను విక్రయించి రూ.42 లక్షలు మోసం చేసిన ఘటనపై పోలీసు లు కేసు నమోదు చేశారు.
ఎదులాపురం, ఆగస్టు 18 : ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాల తో ఆరు ప్లాట్లను విక్రయించి రూ.42 లక్షలు మోసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఐదుగురిని గుర్తించగా, ముగ్గురిని అరె స్ట్ చేసినట్లు సీఐ ప్రేమ్కుమార్ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ల్డ్ హౌసింగ్ బోర్డుకు చెందిన బి.పుష్పలతకు బట్టి సావర్గాం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 3/1లో భూమి ఉన్నట్లు చూపించి 1, 2, 11, 12, 13, 24 నంబర్లను నిందితులు విక్రయించారు.
2021 ఆగస్టు 9న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా కొనుగోలు చేసిన బాధితురాలు అనంతరం స్థలంలో హద్దులు ఏర్పాటు చేసేందుకు వెళ్లగా, అవి తన వి కావని స్థానికులు చెప్పడంతో అనుమానం వచ్చింది. తహసీల్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించగా, వి క్రయదారుల పేర్లు లేకపోవడంతో నకి లీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో మో సానికి పాల్పడినట్లు గుర్తించారు. ఒకో ప్లాట్ కు రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.42 లక్షలు చెల్లించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేరొన్నారు.
ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఎల్టి లక్ష్మణ్ రెడ్డి డబ్బు తిరిగి ఇ స్తానని హామీ ఇచ్చి రూ.5 లక్షలు మా త్రమే చెల్లించగా, మిగతాది చెల్లించకుండా జాప్యం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు వివిధ సెక్ష న్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చే పట్టారు. దర్యాప్తులో భాగంగా టో కల బుచ్చన్న, బొల్లి రాజు అలియాస్ బొల్లి రాజన్న, ఎల్టి లక్ష్మణ్రెడ్డి అలియాస్ లచ్చారెడ్డిని 17న అరెస్ట్ చేశారన్నారు. ఎనుగు నవీన్ కుమార్, బాలే నర్సింలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

