భైంసా, నవంబర్ 27 : బాలికలపై లైంగిక దాడులు పూర్తిగా నియంత్రించేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభిం చింది. పోక్సో కేసుల్లో బాలికలకు త్వరగా న్యాయం చేసేందుకు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు అవగాహన కల్పిస్తు న్నారు. మహిళా రక్షణ చట్టాలు, వాటి ఉపయో గాలపై షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు.
బాలికలపై వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడితే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నారు. భరోసా, సఖీ సెంటర్లకు తరలిస్తారు. డిపార్టుమెంట్ నివేదికల ఆధారంగా 60 రోజుల్లో చార్జిషీట్‌ను కోర్టుకు దాఖలు చేయా ల్సి ఉంటుంది. పోక్సో కోర్టు ద్వారా ఏడాదిలోపు కేసును పూర్తి చేసి శిక్ష ఖరారు చేస్తారు.
సెల్ఫోన్లు, సినిమాల ప్రభావంతో మైనర్లు తెలిసి, తెలియని వయస్సులో తప్పులు చేస్తున్నా రు. తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు పిల్లలకు ఇవ్వ డంతో చాలా మంది సోషల్ మీడియాలోనే గడు పుతున్నారు. అపరిచిత వ్యక్తులు, ఆన్లైన్ పరిచయం, పర్సనల్ విషయాలను పంచుకో వడంతో సైబ్ క్రైమ్‌కు అవకాశం ఏర్పడుతున్నది. దీని కట్టడికి తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. పిల్లలు సెల్‌ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నారో ఎప్పటి కప్పుడు గమనించాలని పోలీసులు చెబుతు న్నారు. దీని ద్వారా పిల్లలు తప్పుదోవలో వెళ్లకుం డా కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు.
ఆపదలో ఉన్న బాలికలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరిపి బాధిత బాలికలకు సఖీ భరోసా సెంటర్ల ద్వారా భరోసా అందిస్తున్నాం. ఆపద సమయంలో డయల్ 100, 1098 లకు ఫోన్ చేయాలి. స్కూల్, కళాశాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి
– పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్