కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : నియోజవర్గ ప్రజలే నాకు కొండంత అండ అని, కార్యకర్తలే నా బలం.. బలగమని సిర్పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప పేర్కొన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్పష్టం చేశారు.
కోనేరు కోనప్ప : నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సీఎం కేసీఆర్ మరోసారి కల్పించారు. నియోజకవర్గ ప్రజలకు నేను చేస్తున్న సేవలు, చేసిన అభివృద్ధిని గుర్తించి మరోసారి టికెట్ ఇచ్చారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే నా ప్రచార అస్ర్తాలు. గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీకంటే రెట్టింపు మెజార్టీ వస్తుంది.
కోనేరు కోనప్ప : సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు నన్ను తప్పకుండా ఆదరిస్తారు. వచ్చే ఎన్నికల్లో నాకు వంద శాతం గెలుపుని అందిస్తారు. 1997 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. సిర్పూర్ నియోజవర్గ ప్రజలు నాకు ఎప్పుడూ అండగా నిలిచారు. ఈసారి కూడా నాకు నాతోనే ఉంటారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలు పొందుతున్నారు. నేను కూడా వ్యక్తిగతంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నా. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశాను. పదేళ్లుగా అభివృద్ధి జరుగని గ్రామం లేదు. సంక్షేమ పథకాలు చేరని ఇల్లులేదు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే నన్ను తప్పకుండా గెలిపిస్తాయి. ఎస్పీఎంను తెరిపించిన ఘనత మాదే. ఏ ప్రభుత్వాలున్నా మిల్లును తుక్కుకు అమ్మేవారు. ప్రజలే నాకు కొండంత అండ.. కార్యకర్తలే నాకు బలం.. బలగం.. అందుకే విజయం పట్ల నాకు పూర్తి నమ్మకం ఉంది. హ్యాట్రిక్ విజయం ఖాయం. తెలంగాణకు కేసీఆర్ సారే సీఎంగా ఉంటారు, సిర్పూర్కు కోనప్పే ఎమ్మెల్యేగా ఉంటారు.
కోనేరు కోనప్ప : సిర్పూర్ నియోజకవర్గంలో ప్రతి పక్షమే లేదనేది నా అభిప్రాయం. ప్రతిపక్షాలకు ఎన్నికల సమయంలో తప్ప.. ప్రజలు ఎప్పుడూ గుర్తుకు రారు. అధికార దాహంతో సిర్పూర్ నియోజకవర్గానికి కొత్తనాయకులు వలస వస్తున్నారు. మరి కొంత మంది కుల, మత రాజకీయాలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలప్పుడు వచ్చి కట్టు కథలు చెప్పే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. కరోనా సమయంలో జాడలేని నాయకులు ఇప్పుడు వచ్చి నీతులు చెబితే ఎవ్వరూ నమ్మేస్థితిలో లేరు. ఇలాంటి ఎత్తుగడలు సిర్పూర్ నియోజకవర్గంలో చెల్లవు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.