బోథ్, ఆగస్టు 21 : బోథ్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాను పబ్లిష్ చేయించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ తహసీల్ కార్యాలయంలో సోమవారం తొమ్మిది మండలాల పరిధిలోని తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు.బోథ్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాను పబ్లిష్ చేయించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ తహసీల్ కార్యాలయంలో సోమవారం తొమ్మిది మండలాల పరిధిలోని తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్ధం చేసిన జాబితాను బీఎల్వోలకు అందించి కేంద్రాల వారీగా పబ్లిష్ చేయాలన్నారు.
ఏమైనా తప్పులున్నాయా సరి చేసుకోవాలన్నారు. అనంతరం పక్కనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం స్టాంగ్ రూం, డిస్ట్రిబూషన్ కేంద్రం కోసం అనువుగా ఉంటుందాని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ స్టాంగ్రూం, డిస్ట్రిబూషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినందున అనువుగా ఉంటుందని రెవెన్యూ అధికారులు వివరించారు. ఆమె వెంట తహసీల్దార్ సుభాష్ చందర్, డిప్యూటీ తహసీల్దార్ ప్రకాశ్, ఎన్నికల విభాగం డీటీ సూరజ్ రావ్, శ్యాం సుందర్ రెడ్డి ఉన్నారు.