ఇంటర్ ఫలితాల్లో సత్తా
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితా లు ఆదివారం విడుదలయ్యాయి. సెకండియర్ ఇంటర్ జనరల్ కేటగిరీ ఫలితాల్లో 71.63 శాతం ఉత్తీర్ణత సాధించి మంచిర్యాల జిల్లా 19వ స్థానంలో నిలిచింది. వొకేషనల్ సెకండియర్ ఫలితాల్లో 76.66 శాతం ఉత్తీర్ణత సాధించి 10వ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో జనరల్ కేటగిరీలో 60.31 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లా 21వ స్థానంలో నిలవగా, వొకేషనల్‌లో 57.55 శాతం ఉత్తీర్ణత సాధించి 23వ స్థానంలో నిలిచింది.
- సెకండియర్‌లో మంచిర్యాల జిల్లాకు 19వ స్థానం
- ఫస్టియర్ ఫలితాల్లో 21 శాతం
- బాలికల హవా
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 12 : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితా లు ఆదివారం విడుదలయ్యాయి. సెకండియర్ ఇంటర్ జనరల్ కేటగిరీ ఫలితాల్లో 71.63 శాతం ఉత్తీర్ణత సాధించి మంచిర్యాల జిల్లా 19వ స్థానంలో నిలిచింది. వొకేషనల్ సెకండియర్ ఫలితాల్లో 76.66 శాతం ఉత్తీర్ణత సాధించి 10వ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో జనరల్ కేటగిరీలో 60.31 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లా 21వ స్థానంలో నిలవగా, వొకేషనల్‌లో 57.55 శాతం ఉత్తీర్ణత సాధించి 23వ స్థానంలో నిలిచింది. కాగా, 2026 ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు జనరల్ కేటగిరీలో ఈ ఏడాది మొత్తం 4741 మంది పరీక్షలు రాయగా, అందులో 3396 మంది ఉత్తీర్ణత సా ధించారు. అందులో 2137 మంది బాలురు పరీక్షలు రాయగా, 1341 (62.75 శాతం)మంది పాసయ్యారు. బాలికలు 2604 మంది పరీక్షలు రాయగా, వారిలో 2055 మంది (78.92 శాతం)పాసయ్యారు. వొకేషనల్ కేటగిరీలో బాలురు 360 మంది పరీక్షలు రాయగా, 234 మంది (65.00 శాతం) పాసయ్యారు.
బాలికలు 424 మంది పరీక్షలు రాయగా 367 మంది (85.56 శాతం) పాసయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌లో మొత్తం 5372 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 3240 మంది (60.31శాతం) పాసయ్యారు. వీరిలో జనరల్ ఇంటర్ కేటగిరీలో బాలురు 2424 మంది పరీక్షలు రాయగా, 1181 మంది (48.72 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2948 మంది బాలికలు పరీక్షలు రాయగా వారిలో 2059 మంది (69.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ కేటగిరీలో మొత్తం 888 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 511 మంది (57.55శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 466 మందికి 222 మంది (47.64 శాతం), బాలికలు 422 మందికి 289 మంది (68.48 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

