సారంగాపూర్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి (Chairman Anvesh Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన వరి ధాన్యాన్ని (Soaked paddy) ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పనిచేస్తుందన్నారు. ఎన్నడు లేని విధంగా ఈ రబీ సీజన్లో వరి ధాన్యం అధిక మొత్తంలో ఉత్పత్తి అయ్యిందని, 2023 సంవత్సరంలో రబీలో 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తే, 2025 సంవత్సరంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాజేశ్వర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఐరా నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు ముక్తార్, కాంగ్రెస్ నాయకులు ఓలాత్రి నారాయణరెడ్డి, ముత్యం రెడ్డి, కండెల భోజన్న, నక్క రాజన్న తదితరులు పాల్గొన్నారు.