జైనథ్, ఆగస్టు 19 : ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా రెండు(సాత్నాల, భోరజ్) మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం గెజిట్ విడుదల చేసింది. జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాలను కలుపుకొని ఏర్పాటు కానున్నాయి. సాత్నాల మండలం పార్డి(బీ), పార్డి(కే), కాన్ప మేడిగూడ, మాంగుర్ల, జామిని, ఆడ, ముక్తాపూర్, కుంభజరి, టాక్లి, రామాయి, జంబుల్‌ధరి, మసాల, బోర్గావ్, తోమగూడ (కార), సైద్పూర్, సహేజ్, దౌన, సాంగ్వి.., భోరజ్ మండలం గూడ, రాంపూర్(టీ), భరోజ్, మీర్జాపూర్, పూసాయి, పిప్పర్వాడ, మాండగాడ, షేకాపూర్, కమాయి, డొల్లార, పెండర్వాడ, దాదాపూర్, కరణ్‌వాడి, లేకర్వాడ, బాలాపూర్, సాయిపూర్, హసీంపూర్, తరోడ(బీ), అవాల్పూర్, పౌజ్పూర్, అకుర్ల, కోరట, కేదార్పూర గ్రామాలతో ఏర్పాటవునున్నాయి. అధికారులు 45 రోజుల పాటు స్థానికుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసి నాయకులు, స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.
సర్వత్రా హర్షం..
కొత్త మండలాల ఏర్పాటుపై ఆయా గ్రామాల స ర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న ఫ్లె క్సీకి బోరజ్ హెడ్‌క్వార్టర్‌లో శనివారం పాలాభిషేకం చేశారు. వైస్ ఎంపీపీ విజయ్ సవాపురే, జడ్పీటీసీ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం, సర్పంచ్‌లు సంతోష్ రెడ్డి, ప్రభాకర్, లింగన్న, భోరజ్ ఎంపీటీసీ మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, రమేశ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.