ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం గణేశ్ నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్యాండు మేళాల మధ్య గణనాథులను నిర్వాహకులు వాహనాల్లో తీసుకొచ్చి వీధులు, కూడళ్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రతిష్ఠించారు. వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన వినాయకులు ఆకట్టుకుంటున్నాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించగా.. నాయకులు, ప్రముఖులు వినాయకులను దర్శించుకున్నారు.