పంద్రాగస్టు పండుగొచ్చిదంటే బడి పిల్లలకు ఎంత సంబుర మో! ఉదయం లేచింది మొదలు స్కూల్ డ్రెస్ మంచిగ ఇస్తిరి చేసుకొని, జేబుకు మూడు రంగల బ్యాడ్జ్ తగిలించుకొని, చేతిలో జెండాతో వాడవాడ లా తిరిగి మురిసి పోతుంటారు. అందు కోసం ముందు రోజు నుంచే ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటుం టారు. కానీ ఇక్కడో బాలుడు మాత్రం ఆ సంబురమేదీ లేకుండా బడిగోడలకు సున్నం వేస్తూ కనిపించాడు. సార్లు చెప్పారని బ్రష్ చేత పట్టుకుని మహబూబాబాద్ సమీపంలోని జామండ్లపల్లి ఎస్టీ హాస్టల్ గోడకు పెయింట్ వేస్తూ బుధవారం ‘నమస్తే’ కెమెరాకు చిక్కాడు. లోలోపల బాధపడుతూ కనీసం ఒంటిపై బట్టలు కూడా లేకుండా దీనంగా కనిపించిన దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ భావిభారత పౌరులకు మీరు చెప్పే పాఠాలు ఇవేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.