టెండర్లకు వేళాయే..
మద్యం దుకాణాల టెం డర్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇం దుకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేయగా, శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 2021-23 దుకాణాల కాలపరిమితి న వంబర్తో ముగియనుండగా మూడు నెలల ముం దుగానే ప్రభుత్వం టెండర్లను నిర్వహించడంతో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆశావాహులకు ప్ర భుత్వం కిక్కులాంటి శుభవార్తను చెప్పింది.
- నేటి నుంచి 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
- 21న డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
- జనాభాకనుగుణంగా స్లాబ్ రుసుము
- గతేడాది మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు రిజర్వేషన్
- దరఖాస్తులు రెట్టింపయ్యే అవకాశం
మరో రెండు నెలల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముం డగా, ప్రభుత్వం మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను ముందుగానే మొదలు పెట్టింది. రెండేండ్ల (2023-25) పాటు వైన్స్లు నిర్వహించేందుకు ఈ నెల 4 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నది. 21న డ్రా పద్ధతిలో షాపులు కేటాయించనున్నది. జనాభాసంఖ్య కనుగుణంగా ఎక్సైజ్ స్లాబ్ రుసుము విధానాన్ని అమలు చేయనున్నది. గతేడాదిలాగే ఎస్సీ, ఎస్టీలతోపాటు గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించనుండగా, గతంలో కంటే పోటీ ఎక్కువగా ఉండనున్నది.
– నిర్మల్ అర్బన్, ఆగస్టు 3
నిర్మల్ అర్బన్,ఆగస్టు 3: మద్యం దుకాణాల టెం డర్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇం దుకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేయగా, శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 2021-23 దుకాణాల కాలపరిమితి న వంబర్తో ముగియనుండగా మూడు నెలల ముం దుగానే ప్రభుత్వం టెండర్లను నిర్వహించడంతో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆశావాహులకు ప్ర భుత్వం కిక్కులాంటి శుభవార్తను చెప్పింది. దీం తో ప్రస్తుతం మద్యం దుకాణం నిర్వహిస్తున్న వ్యా పారులతో పాటు గతంలో లక్కీడ్రాలో అదృష్టం వరించని వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం గత రెండేళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం కల్పిచగా ఈ సారి కూడా అదేవిధంగా టెండర్ల ప్రక్రియ నిర్వ హించనుంది. ఈ ఏడాది గతం కంటే పెద్ద సం ఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 47 మద్యం దుకాణాలు..
నిర్మల్ జిల్లాలో 19 మండలాలు ఉండగా, రెండు ఎక్సైజ్ స్టేషన్లు నిర్మల్, భైంసాలో ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 47 మద్యం దు కాణాలు ఉన్నాయి. వీటిలో మూడు మద్యం దు కాణాలను గౌడ, 5 దుకాణాలు ఎస్సీలకు కేటాయించనున్నారు. ఈ ఎనిమిది మద్యం దుకాణాలకు కేవలం ఈ కులస్థులు మాత్రమే దరఖాస్తు చే సుకునే అవకాశం ఉంది. మిగతా 39 మద్యం దు కాణాలకు ఏ కులస్థులైన తమ దరఖాస్తులను స మర్పించుకోవచ్చు. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలు భారీ స్థా యిలో ఉండే అవకాశం ఉంది. దీంతో పెద్ద సంఖ్య లో ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఒక్కో దుకాణానికి రూ.2 లక్షల ఫీజు
జిల్లాలోని 47 మద్యం దుకాణాల్లో రిజర్వ్ దుకాణాలు మినహా ఒక్కో వ్యక్తి ఒక్కో దుకాణానికి ఎ న్ని దరఖాస్తులనైనా సమర్పించవచ్చు. జిల్లా కేం ద్రంతో పాటు రాష్ట్రంలోని 2620లోని ఏ మద్యం దుకాణానికైనాన టెండర్ వేయవచ్చు. ఒక్కో దరఖాస్తుకు గతంలో మాదిరిగానే రూ.2 లక్షలు ( నా న్ రిఫండెబుల్) నిర్ణయించారు. దరఖాస్తు ఫీజులను రూ. 2 లక్షల డీడీతోగాని, చలాన్ రూపంలో గాని చెల్లించవచ్చు. దరఖాస్తులను జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుం చి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.
మూడు నెలల ముందుగానే..
నూతన ఎక్సైజ్ పాలసీ 2023-25 ప్రకారం న వంబర్ నెలలో నోటిఫికేషన్ రావాల్సి ఉండగా, ప్రభుత్వం ఆగస్టు నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించడంతో టెండర్లలో పాల్గొనే ఆశావహులకు మూడు నెలల ముందుగానే అదృష్టం దక్కనుందని సంబురపడుతున్నారు.


Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కస్తాలలో సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

