జై నూర్ : ఈ నెల 21న అసిఫాబాద్ జిల్లాలో నిర్వహించే మహాసభను ( Mahasabha ) విజయవంతం చేయాలని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ గురువారం పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 12 ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే సహజ, ప్రమాద, మరణం, పాక్షిక, పూర్తిస్థాయి, అంగవైకల్యానికి ఇచ్చే సంక్షేమ నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేసిన రూ. 346 కోట్లను వెంటనే వాపస్ తీసుకోవాలని వెల్ఫేర్ బోర్డు అడ్వయిజరీ కమిటీని వెంటనే అనుభవజ్ఞులైన ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించా లన్నారు. ప్రభుత్వంలోని అధికారులు, వెల్ఫేర్ బోర్డు నిధులను తమ ఇష్టానుసారం బదిలీ చేయడం ఖర్చు పెట్టడం చట్ట విరుద్ధమన్నారు.
55 సంవత్సరాలు నిండిన కార్మికులకు కనీసం రూ. 9వేల పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని , పెళ్లి కానుక ప్రసూతి కానుక రూ. 30 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలని, సహజ మరణం ఇస్తున్న లక్షా 30 వేలను రూ. 5 లక్షలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి ఆనందరావు, రామచందర్, వెంకన్న, మహేష్ ,,సదయ్య బాలాజీ , పవర్ ప్రకాష్, దుర్గయ్య, షేక్ అజీమ్, సింగరావు, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.