ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 7 : ఆసిఫాబాద్ నియోజక వర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారను ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని సెక్రెటేరియేట్లో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. కొత్తగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి ఎకువ మొత్తంలో నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని, నిధులు కేటాయించి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆమె కోరగా, ఆయన సానకూలంగా స్పందించారు.
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 7 : హైదరాబాద్లోని సెక్రెటరియేట్లో తెలంగాణ సీఎస్ (చీఫ్ సెక్రటరీ) రామకృష్ణారావును ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించి పరిషారానికి కృషి చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.