ఆదిలాబాద్, నవంబరు 26 ( నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో రైతుల ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ పా ర్టీ చేస్తున్న కుట్రలు బహిర్గతమయ్యాయి. రైతు భరోసా పథకంలో భాగంగా పట్టాదారుకు, కౌలురైతు కు ఎకరాకు రూ. 15 వేల ఆర్థికసాయం అందిస్తామని ఆరు గ్యారెంటీల్లో ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాట మార్చారు. రూ. 15 వేల ఆర్థిక సాయాన్ని భూ యజమాని లేదా కౌలు రైతు ఇద్దరిలో ఒక్కరికే మాత్రమే ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆ పార్టీ మోసకారితనాన్ని బహిర్గతం చేసింది. ఎన్నికల ప్రచార సభల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాకగాంధీతో పాటు రాష్ట్ర నాయకులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇతర నాయకులు రైతుల ఆర్థిక సాయాన్ని ప్రస్తావిస్తున్నారు. అచరణలో అమలు కానీ హామీలిస్తూ అ న్నదాతలను మభ్యపెడుతున్నారు.
హస్తం పార్టీ నాయకుల మాటలను రైతులు ఏ మాత్రం విశ్వసించడం లేదు. ఎన్నికల్లో ఓట్ల కోసం రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేయడం కాంగ్రెస్ నాయకులకు అలవాటేనని రైతులు మండిపడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారని, ఎన్నికల తర్వాత రూ.16 వేలు ఇస్తామని చెబుతున్నారని పేర్కొంటున్నారు. కేసీఆర్పై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నదాతలు చెబుతున్నారు. ఈ ఎన్నిక ల్లో హస్తం పార్టీకి తగిన బుద్ధి చెబుతామని రైతులు ముక్త కంఠంతో స్పష్టం చేస్తున్నారు.
రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుని మోసం చేయడం కాంగ్రెస్ నైజం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు పడ్డ కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. విత్తనాలు, మందు బస్తాలకోసం పోలీసుల లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చేది. పంట పెట్టు బడులు లేక అప్పులు చేసేటోళ్లం. కరెంటు లేక చేతికి వచ్చిన పంటలు నష్టపోవాల్సి వచ్చి అ ప్పులు తీర్చలేని పరిస్థితి ఉండేది. రైతుల ఇబ్బందులను దూరం చేయాలని నాయకులను కోరినా ఫలితం మాత్రం శూన్యం.
రైతుబిడ్డ కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో ప థకాలను అమలు చేసి రైతులకు పెద్దన్నలా ఉంటున్నడు. వ్యవసాయం బాగుపడాలంటే ఏమి చేయాలో ఆయనకు బాగా తెలుసు. రైతులకు ఎకరాకు రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ. 15 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాట మార్చారు. ఎవరికో ఒకరికి మాత్రమే రూ.15 వేలు ఇస్తమని రేవంత్ రెడ్డి అనడం నిజస్వరూపాన్ని బయటపెట్టింది. గిప్పుడే మాటలు మారుస్తున్నరు. గీళ్లను నమ్మితే నిండా మునుగుతం.
కాంగ్రెస్ పార్టీ అధికారం దాహంతో రైతులను మభ్యపెట్టాలని ప్రయత్నా లు చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథ కాన్ని కాపీ కొట్టి రైతు భరోసా అనే పథకం అమలు చేస్తామంటున్నది. ఈ పథకంలో భాగంగా ఏటా ఎకరాకు రైతుకు రూ.15 వేలు, కౌలు రైతు లకు రూ.15 వేలు ఇస్తామని అంటున్నరు. ఇప్పుడు అసలైన రైతులకు డబ్బులు ఇస్తే కౌలు రైతులకు ఇవ్వం. కౌలు రైతులకు ఇస్తే అసలైన రైతు లకు ఇవ్వమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నరు. ఎద్దు, ఎ వుసం తెలియని రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి ఏ మాత్రం అవగా హన లేదు. రైతులకు ఎలాంటి పథకాలు అమలు చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. అచరణలో సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ రైతుల ను మోసం చేయాలని చూస్తున్నది.
కోటపల్లి, నవంబర్ 26 : పచ్చగా ఉన్న తెలంగాణ లో రైతుల మధ్య చిచ్చు పెట్టి రాక్షసానందం పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. రైతు బంధు భూమి యజమానికి ఇస్తే కౌలుదారు డికి ఇవ్వమని, కౌలు రైతుకు ఇస్తే భూమి యజమానికి ఇవ్వమని రేవంత్ రెడ్డి చెప్పి ఎన్నికలకు ముందే రైతుల మధ్య కొట్లాట పె ట్టాలని చూస్తున్నడు. కౌలు రైతులకే రైతు బం ధు ఇవ్వడం ద్వారా పట్టాదారుడు ఆ భూమి పైన హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే రెండు నా లుకల ధోరణితో రైతులను ఇబ్బం దులు పె ట్టాలని చూస్తోంది.
కాంగ్రెస్కు తెలంగాణలో రైతులు బాగుపడడం ఇష్టం లేక ఇలా రకరకాల ప్రకటనలు చేస్తూ మోసం చేయాలని చూస్తోంది. రైతుబంధుపై స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్న కేసీఆర్ వెంటే మేమంతా ఉంటం. అసలు ఢిల్లీ లీడర్లకు తలొగ్గి మాట్లాడే ఈ కాంగ్రెసోళ్లను ప్రజలెవరూ నమ్మరు. వాళ్లయ్యన్నీ అబద్ధాలే. ప్రజలకు మంచి జేసుడు వాళ్లతోని కాదు. ఉత్త ముచ్చట్లు అన్ని చెబుతరు. ఆరు గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ మీద అ ప్పుడే యూటర్న్ తీసుకున్నరు. ఇగ మిగతాయి కూడా రేపో, ఎల్లుండో బయట పడుతరు.
-సల్పాల పోచం, మల్లంపేట, (కోటపల్లి)
కాంగ్రెస్ పార్టీని నమ్మితే రైతులకు మొదటికే మో సం వస్తది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకోలేదు. రై తుల వ్యవసాయం చేయాలంటేనే భయపడేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల ఫలితంగా వ్యవసా యం పండుగలా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నది. లేని, పోని హామీలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నది.
రైతు భరోసా పేరిట పట్టాదారు కు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.15 ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో ప్రకటించి లబ్ధి పొందాలనుకుంటున్నారు. రైతులు కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మడం లేదు. ఇప్పుడు రేవంత్రెడ్డి రైతుభరోసాలో పట్టాదారు, కౌలు రైతుల్లో ఎవరికన్న ఒకరికే పైసలు వస్తాయంటున్నరు. ఆయన మాటలు విన్న తర్వాత కాంగ్రెస్ నాయకుల నిజస్వరూపం బయటపడింది. ఎన్నికల్లో ఓట్ల కోసం వారు హామీలు ఇస్తున్నారే తప్ప రైతుల మేలు చేయాలని ఉద్దేశంతో కాదని అర్థమైంది. కాంగ్రెస్ నాయకుల మాయమాటలు రైతులందరూ గమనించిన్రు. రైతులకు మేలు చేస్తున్న బీఆర్ఎస్ను గెలిపించుకుందామని నిర్ణయించుకున్నరు.
– వెంకట్రెడ్డి, రైతు, కజ్జర్ల, తలమడుగు మండలం
కోటపల్లి, నవంబర్26: రైతుబంధు ఇవ్వడం ఇష్టం లేక కాంగ్రెస్ ప్రభుత్వం నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది. రైతుభరోసా అంటూ ఓ పథకం పెడుతమని ముందుగా చెప్పింది. గిప్పుడు దాని కో కొర్రీ పెట్టబోతున్నట్లు లీక్ ఇచ్చింది. భూమి యజమానికి ఇస్తే కౌలుదారుకు ఇవ్వబోమని, కౌలు రైతుకు ఇస్తే భూ యజమానికి ఇవ్వబోమని అంటున్నది.
రేవంత్ రెడ్డి రైతుల మధ్య వైరాన్ని పెంచాలని చూస్తున్నడు. గీళ్ల ఓట్ల కోసం గిన్ని కుట్రలు చేస్తరా..? కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్, అసలు కౌలు రైతులను ఏటా ఎలా గుర్తిస్తాడో చెప్పాలి. ఈ విధానం ద్వారా రైతుబంధు ఇవ్వడం ద్వారా రైతుబంధు దుర్వినియోగమై ప ట్టాదారులు, భూ యజమానులకు గొడవలు జరిగే ఆస్కారం ఉంది. కాంగ్రెసోళ్లు ప్రజా కోణంలో ఏదీ చేయరు. వాళ్లకు ఓట్లే కావాలె. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఎన్నికల్లో గెలవాని చూసిన్రు. గెలిచినంక విస్మరిద్దామని చూసిన్రు. కానీ ఇప్పుడు రే వంత్ రెడ్డి నోరు జారి వారి పన్నాగం బయట పెట్టిండు.
– సలీం, షట్పల్లి
కోటపల్లి, నవంబర్26: రైతులను మోసం చేసే కుట్రల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నడు. వాళ్లు చెప్పి గారెంటీల్లో భా గంగా రైతు భరోసాపై అప్పుడే మాట తప్పుతున్న రు. భూ యజమానికి కాకుండా కౌలు రైతులకు ఇస్తమని చెప్పడం కాంగ్రెస్ అవివేకానికి నిదర్శ నం. గిప్పుడు యజమానికి ఇస్తే కౌలుదారుకు ఇ వ్వబోమని, కౌలు రైతుకు ఇస్తే భూ యజమానికి ఇవ్వబోమని చెప్పి మాట మార్చిన్రు. దీని ద్వారా గ్రామాల్లో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నరు. శాంతియుతంగా ఉన్న పల్లెల్లో మళ్లీ అల్లర్లు జరిగితే బాధ్యత ఎవరిది..? ఏటా రెండు పంటలకు కౌలు రైతులను గుర్తించడం చాలా పెద్ద సమస్య. వీటితో పాటు భూమిని కౌలు రైతుకు సంపూర్ణ బాధ్యతలు అప్పగించడం ద్వారా భవిష్యత్తులో భూ యజమానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రైతులకు రైతుబంధు ఇవ్వలేమని చె ప్పకనే ఇలా రేవంత్ రెడ్డి విపరీత ప్రకటనలు చేస్తున్నడు.
– రాళ్లబండి పోచం, కోటపల్లి
నెన్నెల,నవంబర్26: నాకు ముందుగాల నుంచి కాంగ్రెస్ పార్టీ లీడర్ల గురించి తెలుసు. వాళ్ల మాట అస్సలు నమ్మను. వాళ్లు ఢిల్లీ పెద్దలు చెప్పిందే ఈడ మాట్లాడుతరు. రైతు భరోసా ఇస్తమని చెప్పి అప్పుడే మాట మార్చిన్రు. కాంగ్రెస్ నాయకులకు రెండు నాల్కలు ఉన్నయి. స్టేజీల మీదనేమో రైతు భరోసా అందరికీ ఇస్తం అని చెప్పి, ఇప్పుడు కౌ లు రైతులకా.. పట్టా రైతులకా ఎవరికి ఇచ్చుడో కూడా కచ్చితంగా చెబుతలేరు. ఎన్నికల ప్రచా రంలో మాత్రం ఆరు గ్యారెంటీలు అని పెద్ద పెద్ద గా మాట్లాడే నాయకులు ఇప్పుడు రేవంత్ చెప్పిన మాటలు రైతు బంధు ఇయ్యమ న్నట్లుగనే అంటున్నడు. కాంగ్రెస్ నాయకుల హామీలు నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలయ్యినట్లు ఉన్నయి. రైతు బంధు పథకం రైతులకు ఇయ్యద్దనే కాంగ్రెస్ పార్టీకి ఉంది. రైతులు ఎవరు వారి మాటలను నమ్మడం లేదు. వారి చరిత్రేందో టీవీలో చూస్తే తెలిసింది.రైతులెవ్వరూ కాంగ్రెస్ కు ఓటేయబోమని చెబుతున్నరు. ఇగ తెలంగాణల కాంగ్రెస్ దుక్నం బంద్చేసుకునుడే.
– ఆనందపు రాజన్న, రైతు నెన్నెల