సీఎం పర్యటనతో ప్రయోజనం శూన్యం
ప్రజాపాలనలో భాగంగా సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఈ ప ర్యటనతో జిల్లావాసులకు ప్రయోజనం చేకూరలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోడు భూములు, మౌలిక వసతుల సమస్యలపై ప్రకటన చేయలేదు. సీఎం ప్రసంగం మొత్తం ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణాలు.. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలకే పరిమితమైంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు గిరిజనుల సమస్యలను ప్రస్తావించి, వాటిపై సీఎం స్పందించాలని కోరినప్పటికీ పరిష్కారం చూపలేకపోయారు.
- ప్రస్తావనకు నోచుకోని పోడు భూముల సమస్యలు
- ఇందిరమ్మ ఇండ్ల చుట్టే ముఖ్యమంత్రి ప్రసంగం
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి దక్కని ప్రాధాన్యత
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ) : ప్రజాపాలనలో భాగంగా సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఈ ప ర్యటనతో జిల్లావాసులకు ప్రయోజనం చేకూరలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోడు భూములు, మౌలిక వసతుల సమస్యలపై ప్రకటన చేయలేదు. సీఎం ప్రసంగం మొత్తం ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణాలు.. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలకే పరిమితమైంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు గిరిజనుల సమస్యలను ప్రస్తావించి, వాటిపై సీఎం స్పందించాలని కోరినప్పటికీ పరిష్కారం చూపలేకపోయారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. ప్రాణహితపై బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ స్పందించడం లేదని, జిల్లావాసులు మహారాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ప్రాణహిత నిర్మాణానికి అనుమతి కల్పించేలా మహారాష్ట్ర సర్కారును ఒప్పించాలన్నారు. బ్యారేజీ వల్ల మహారాష్ట్రలో కేవలం 2 వేల ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతున్నదని పేర్కొన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటి ఎదుట లేదా బీజేపీ కార్యాలయం ఎదుట ధాన్యాన్ని కుప్పలు పోస్తామని హెచ్చరించారు. మొత్తం మీద సీఎం పర్యటన వల్ల జిల్లావాసులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదనే విమర్శలు వస్తున్నాయి.
ఎమ్మెల్యే కోవలక్ష్మికి దక్కని ప్రాధాన్యత
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా కాగజ్నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాల్సిన నేపథ్యంలో నిర్లక్ష్యం వహించడం విమర్శలకు తావిచ్చింది. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తవిస్తారనే భయంతోనే కోవలక్ష్మికి మాట్లాడే అవకాశం కల్పించలేదని తెలుస్తున్నది. సీఎం సభలో కోవ లక్ష్మికి మాట్లాడే అవకాశం కల్పించక పోవడంతో ఎమ్మెల్యే సభ మధ్యలోనే వెళ్లిపోయారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

