నిర్మల్ చైన్‌గేట్, మే 1 : కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం అధికారులు, రైస్‌మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎంఆర్ సరఫరాలో ప్రతి మిల్లరూ గడువులోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇక నుంచి రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించాలంటే వారు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ధాన్యాన్ని ప్రభుత్వానికి అందజేస్తామన్న ఒప్పందం చేసుకుంటేనే ధాన్యం కేటాయిస్తామన్నారు. రైస్‌మిల్లులో హమాలీల సంఖ్యను పెంచి మిల్లింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, డీఎం సివిల్ సప్లయ్ సుధాకర్, ఎల్డీఎం రామ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.