లక్షెట్టిపేట, అక్టోబర్ 11 : కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకే బీఆర్ఎస్ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమం చేపట్టిందని, వాటిని ఇంటింటికీ పంపిణీ చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం లక్షెట్టిపేట పట్టణంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి మోసం చేసిందన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలు, శ్రేణులను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కార్డులను చూపించి, తమ బాకీ తీర్చాలని ఒత్తిడి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి.. కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు తిప్పని లింగయ్య. కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచుచిన్నయ్య, మున్సి పల్ మాజీ చైర్మన్ నలమాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పాడేటి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, నాయకులు అంకతి గంగాధర్, పెట్టెం తిరుపతి, మైనార్టీ నాయకులు షేక్ చాంద్ ఓడగంటి శ్రీకాంత్, మెట్టు రాజు, దండేపల్లి మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాయమల్లు, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ లింగన్న, వైస్ చైర్మన్ అకల రవి, పెద్ద మొత్తంలో లక్షెట్టిపేట, దండేపల్లి కార్యకర్తలు పాల్గొన్నారు.