సోన్, ఫిబ్రవరి 12 : తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడు తున్న నేప థ్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు వృద్ధిరేటు గణనీయంగా ఉంది. నిర్మల్ మండలంలోని 20 గ్రామ పంచా యతీల్లో ఇప్పటికే గ్రామ నర్సరీలను ఏర్పాటు చేసి ఒక్కొక్క నర్సరీల్లో 11 వేల మొక్కల చొప్పున పెంచేందుకు కార్యాచరణ రూపొందిం చారు. ఇప్పటికే అన్ని నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికారులు పండ్లు, పూల మొక్కలు, డెకరేషన్ మొక్కలు, నీడనిచ్చే మొక్కలు వంటి 9 రకాల వంటి విత్తనాలను నాటారు. అవి మొలకెత్తే దశకు చేరుకున్నాయి. మొక్కలు త్వరగా పెరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. నర్సరీలపై గ్రీన్షెడ్డులను ఏర్పా టు చేసి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళ ల్లో నీటితో తడుపుతున్నారు. మొక్కలు ఎండిపో కుండా జాగ్రత్త పడుతున్నారు. బ్యాగ్‌ల్లో మొల కెత్తని వాటిని గుర్తించి రెండో దశ కింద విత్తనాలు వేసి వాటిని సంరక్షిస్తున్నారు. ఇందుకోసం ఉపాధి హామీ కూలీలను వినియోగిస్తున్నారు.
కూలీలకు చేతినిండా ఉపాధి..
నర్సరీల నిర్వహణ వల్ల ఉపాధి హామీ కూలీలకు చేతినిండా పని దొరుకుతున్నది. ఉపాధి హామీ పథకం కింద జాబ్‌కార్డు పొందిన ప్రతి ఒక్కరికీ వంద దినాల పని కల్పించాలని ప్రభు త్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ప్రస్తు తం వ్యవసాయ పనులు ముగియడంతో ఇప్పుడు కూలీలు నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రోడ్ల పక్కన మొక్కలు నాటడం, నాటిన మొక్కలను సంరక్షించడం, నీటిని పోయ డం వంటి పనులకు ఉపయోగించుకుంటున్నా రు. మండలంలోని అక్కాపూర్, చిట్యాల్, వెంగ్వా పేట్, లంగ్డాపూర్, తల్వేద, మేడిపెల్లి, నీలాయి పేట్, రత్నాపూర్‌కాండ్లీ, ముజ్గి, భాగ్యనగర్, న్యూపోచంపాడ్, తదితర గ్రామాల్లో జోరుగా ఉపాధి కూలీలకు నర్సరీల ద్వారా ఉపాధి లభి స్తున్నది. ప్రతి రోజూ అధికారులు నర్సరీలను పరిశీలించి మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి..
మొక్కల సంరక్ష ణపై అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లిం గ్ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. విత్తనాలు నాటడంతో మొక్కలు ఇప్పుడిప్పుడే మొలకె త్తుతున్నాయి. రాను న్న వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ షెడ్లను ఏర్పాటు చేయిస్తున్నాం. ఉపాధి హామీ కూలీలకు నర్సరీల వల్ల ఉపాధి కల్పిస్తున్నాం. నాటిన మొక్కల్లో 80 శాతం మొలకెత్తేలా చర్యలు తీసుకుంటున్నాం.
– తుల రామకృష్ణ, ఏపీవో(నిర్మల్ రూరల్)