నిర్మల్ అర్బన్, జూన్ 10 : నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు, ఇన్విజి లేటర్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని ఇప్పటి కే నిర్వహించారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 4489 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతి పరీక్షా కేంద్రం లో తాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు, వైద్య సిబ్బంది ని అందుబాటులో ఉంచారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ అమలు పర్చారు. పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు.
జిల్లాలో 14 పరీక్షా కేంద్రాల్లో 14 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, నలుగురు రూట్ అధికారు లు, 14 మంది లైజన్ అధికారులు, 198 మంది ఇన్విజిలేటర్ల నియమించారు. ప్రతి పరీక్ష గదిలో సీసీ కెమరాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజర య్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు, వెంట తీసుకు రావాల ని, పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరా లు, సెల్ ఫోన్లను ఇతర వస్తువులను తీసుకు రావద్దని అధికారులు సూచించారు.
నిమిషం నిబంధన అమలు..
అభ్యర్థులు తమకు కేటాయించిన సెంటర్లకు గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉంటుందని చెప్పారు. పరీక్షా కేంద్రంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందు ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయకుండా ఉండేందుకు అభ్యర్థుల గుర్తింపు కొరకు బయెమెట్రిక్ పద్ధతిలో వేలి ముద్రలు తీసుకోనున్నారు. ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకో వాలని అధికారులు సూచిస్తున్నారు. చేతులకు గోరింటాకు, మెహందీ పెట్టుకోవద్దని, బయో మెట్రిక్‌లో వేలి ముద్రలు సరిగా పడే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, క్యాలి క్యూలేటర్లు, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఓటర్, ఆధార్, పాన్, ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డులతో కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 10 :గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పీఎస్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నలం ద డిగ్రీ కళాశాల గ్రూప్-1 పరీక్షా కేంద్రంలోని గదులను, సీసీ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ జూన్ 11న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షాకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. జిల్లాలో 19 కేంద్రాల్లో 6190 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఉదయం 10.30 నుంచి పరీక్ష ప్రారంభం అవుతుందని అభ్యర్థులు ఉదయం 8.30 నుంచి 10.15 నిమిషాల వరకు ఆయా కేంద్రాలకు చేరుకోవాలని, 10.15 నిమి షాలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారని తెలిపారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా, తాగునీరు, మెడికల్ కిట్, మరు గుదొడ్లు, డ్యూల్ డెస్క్‌లు ఉండేలా ఏర్పాట్లు చేశా మని పేర్కొ న్నారు. మారుమూల ప్రాంతాల అభ్యర్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరు కునేలా ఆయా రూట్లలో బస్‌లను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించామని తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004251 939ను సంప్రదించాలన్నారు. హాల్ టికెట్లో ఫొటో లేని అభ్యర్థులు గెజిటెడ్ అధికారితో ధ్రువీ కరించుకొని మూడు పాస్ ఫొటోలను పరీక్షా కేంద్రానికి వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ పున్నరావ్, లైజన్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.