మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 13 : మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు సోమవారం(ఈ నెల 13)తో ముగిశాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 9703 మంది రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలైన 47 మంది పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకో సం 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 48 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 48 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 48 మంది సిట్టింగ్ స్కా డ్లు, 48 మంది ఫ్లయింగ్ స్కాడ్లను నియమించారు.
460 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించారు. పరీక్ష- పరీక్షకు మధ్య ఐదు నుంచి ఆరు రోజుల వ్యవధి రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడ్డారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా ‘పది’ పరీక్షల షెడ్యూల్‌పై పెదవి విరిచారు. సోమవారం చివ రి పరీక్ష రాసిన విద్యార్థులు కేరింతలు కొడుతూ ఇం డ్లకు వెళ్లిపోయారు. పాఠశాల చదువుకు స్వస్తిపలికి ఇకపై కాలేజీలకు వెళ్తామన్న ఆనందంతో ముందుకు సాగారు. చివరి పరీక్ష రాసిన అనంతరం ఒకరినొకరు పలకరించుకుంటూ, బైబైలు చెప్పుకున్నారు.
ఆసిఫాబాద్‌లో..
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 13 : పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన పరీక్షకు మొత్తం 6,950 మంది విద్యార్థులకు 6,927 మంది హాజరయ్యారు. 23 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ జనార్దన్‌గౌడ్ పలు కేంద్రాలను తనిఖీ చేశారు.