మంచిర్యాలటౌన్, జనవరి 28 : ప్రమాదాల నివారణే లక్ష్యంగా టీజీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులు, సిబ్బంది పనిచేయాలని సంస్థ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషాఖాన్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు, ప్రగతిచక్ర అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం మంచిర్యాల డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణలో డ్రైవర్లు, కండక్టర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, వారి సమన్వయంతో ప్రమాదాలు నివారించవచ్చన్నారు. కార్మికులను ప్రోత్సహించడం కోసమే డిపో పరిధిలో నెలకోసారి, రీజియన్ పరిధిలో మూడునెలలకోసారి, జోనల్ పరిధిలో ఆరు నెలలకోసారి ఉత్తమ అవార్డులు అందిస్తున్నట్లు తెలిపారు.
మిగతా రీజియన్లతో పోల్చుకుంటే ఆదిలాబాద్ రీజియన్‌లో ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉందని, ఇంకా ఈ సంఖ్యను తగ్గించాలని సూచించారు. అనంతరం ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ సోలోమన్, వరంగల్ రిజినల్ మేనేజర్ మాధవరావు, డిప్యూటీ ఆర్ఎంలు ప్రణీత్, ప్రవీణ్, మంచిర్యాల డిపో మేనేజర్ జనార్దన్, ఆసిఫాబాద్ డీఎం విశ్వనాథ్, ఆదిలాబాద్ డీఎం కల్పన, అధికారులు, తలదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలకు వచ్చిన ఆర్టీసీ ఈడీ ఖుస్రోషాఖాన్కు ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు సభ్యుడు సత్తయ్య పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. లహరి బస్సును బెంగళూరు కు నడపాలని, గుంటూరుకు మంచిర్యాల నుంచి బస్సును నడపాలని, బస్టాండ్‌ను విస్తరించి, బస్సుల సంఖ్య పెంచాలని, అందుకు తగ్గట్లు డ్రైవర్లు, కండక్టర్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఆర్టీసీ క్వార్టర్లు ఆధునీకరించాలని విన్నవించారు.
అవార్డులు పొందిన వారు..
ఇంధన పొదుపు విభాగంలో : ఏ రాజేశ్వర్ (ఆసిఫాబాద్ ), ఎస్ కే అసదుల్లా (నిర్మల్ ), రాంశ్రీనివాస్, తిరుపతి, కే శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్ (మంచిర్యాల), జే రాజేశ్వర్, కే హన్మంత్ , ఏఎస్ నారాయణ (నిర్మల్ ), హుస్సేన్బిన్ (ఆదిలాబాద్)
ఉత్తమ కండక్టర్లు : సుభాష్, చంద్రయ్య, విశ్వజిత్, హరిసింగ్, దేవయ్య (ఆసిఫాబాద్), జేఈ సింగ్ (ఆదిలాబాద్), కే మల్లేశ్ (నిర్మల్)
ఉత్తమ టిమ్ డ్రైవర్లు : ఎస్డీ అలీమ్, ఎండీ రఫీక్ అహ్మద్ (నిర్మల్ ), బీదశరథ్ (మంచిర్యాల )
హైర్ బస్ డ్రైవర్లు : మల్లేశ్, నరేందర్, అలీం, ఎస్కే జబ్బార్, జేఏ అనిల్ (నిర్మల్ )
గ్యారేజీ స్టాఫ్ : శంకర్ (భైంసా), ఎం రామయ్య (ఆసిఫాబాద్ ), ఎస్ శ్యాం (నిర్మల్ )