ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై చలి పంజా విసిరింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డకట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. గురువారం సిర్పూర్(యూ)లో కనిష్ఠంగా 8.8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగా.. ప్రజానీకం గజగజ వణికిపోయింది. ఆయాచోట్ల ఉదయం 9 గంటల దాకా పొగమంచు తొలగ లేదు. వాహనాల రాకపోకలకు డ్రైవర్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇగ సాయంత్రం ఆరింటికే ఇగం మొదలుకాగా, రోడ్లపై సందడి కనిపించలేదు. ఇదెక్కడి చలిరా బాబోయ్ అంటూ చిన్నా.. పెద్దలంతా చలి మంటలు కాగుతూ కనిపించారు.
– సిర్పూర్(యూ)/లింగాపూర్/బెజ్జూర్/హాజీపూర్/మంచిర్యాల స్టాఫ్ ఫోటోగ్రాఫర్, నవంబర్ 24