ఎదులాపురం, మే 10 : అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 35 బృందాలతో పది మండలాల్లోని స్రాప్ దుకాణాలపై పోలీసులు మూకుమ్మడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. దొంగ వస్తువులను కొన్న, కొనడానికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల, బేల, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ నార్నూర్ బోథ్ ఏకకాలంలో స్రాప్ దుకాణాలలో పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించామన్నారు. 13 స్రాప్ దుకాణాల వద్ద పలు వస్తువులు లభ్యమైనట్లు తెలిపారు. లభ్యమైన షాపులపై ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.