నిర్మల్, మే 21 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు న మోదవుతుంటే.. ఉపాధ్యాయులు మాత్రం వీధుల వెంట తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. బడిబాట, జనగణన వివరాలు సేకరిస్తూ రెండింటి మ ధ్య నలిగిపోతున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి జనగణన సర్వే కొనసాగుతుండగా.. జూన్ 9వ తే దీన ముగియనుంది. అదేవిధంగా ఈ నెల 14వ తేదీన బడిబాట ప్రారంభం కాగా జూన్ 19వ తేదీ న ముగియనుంది. నిర్మల్ జిల్లాలో 1,405 మంది టీచర్లు(ఎన్యుమరేటర్లు) జనగణనలో పాల్గొంటున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 250 నుంచి 300 ఇండ్లను కేటాయించడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఒకేసారి రెండు కీలక బాధ్యతలు నిర్వహించలేక క్షేత్రస్థాయిలో టీచర్లు సతమతం అవుతున్నారు. సాధారణంగా మే, జూన్‌లో బడిబాట నిర్వహిస్తారు. దీనికి తోడు ఇప్పుడు జనగణన(సర్వే) బాధ్యతలను కూడా ఉపాధ్యాయులకే అ ప్పగించడంతో వారిపై పనిభారం రెట్టింపైంది. ఉద యం గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ పిల్లలను బడిలో చేర్పించాలని ప్రచారం చేస్తున్నారు. ఆ త ర్వాత మండుటెండలో జనగణన కోసం ప్రతి ఇల్లు తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఉ ష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు న మోదవుతున్నాయి. వడగాల్పుల తీవ్రత కూడా అ ధికంగా ఉంది. దీంతో ఎండ దెబ్బకు చాలా మంది ఉపాధ్యాయులు నీరసించిపోతున్నారు. కొందరు ఉపాధ్యాయులు వడదెబ్బకు గురై ఆసుపత్రుల్లో చేరుతుండగా, మహిళా ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. బడిబాటను జూన్ మొదటి వారం తర్వాత నిర్వహించాలంటూ పలు ఉపాధ్యాయ సంఘాలు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చాయి. జనగణనకు సంబంధించి డిజిటల్ యాప్‌లో వివరాల నమోదు, ఆన్లైన్లో అప్లోడింగ్, ఫారాల భర్తీతోపాటు బడిబాట నివేదికలు రూపొందించడం.. ఇలా ఉపాధ్యాయు లు బోధనేతర పనుల్లో మునిగిపోవాల్సి వస్తున్నదని సంఘాల నేతలు వాపోతున్నారు. కనీస రక్షణ చర్యలు(ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు) లేకుండా క్షేత్రస్థాయికి పం పడంపై వారు మండిపడుతున్నారు.
జనగణన కోసం ఇంటింటికీ తిరుగుతున్న ఎ న్యుమరేటర్లకు ప్రజల నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందడం లేదు. ఎండల భయానికి జనం పగటిపూట తలుపులు వేసుకొని ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో సర్వే కోసం వెళ్లే ఉపాధ్యాయులకు సరైన సమాచారం అందించడానికి వారు నిరాకరిస్తున్నారు. ఈ ఎండల్లో ఇప్పుడే రావాలా? అంటూ కొందరు విసుక్కొంటుంటే, మరికొందరు ఇళ్లల్లో లేకపోవడంతో ఒకే ఇంటికి రెండు, మూడు సార్లు తిరగాల్సి వస్తున్నదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో అటు బడిబాట లక్ష్యాలు, ఇటు సర్వే వివరాల నమోదు సకాలంలో పూర్తి చేయడం కష్టంగా మారుతున్నది. భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ఇలాంటి ప్రతికూల వాతావరణంలో డబుల్ డ్యూటీలు చేయిస్తూ ఇబ్బంది పెట్టడం వారి ఆరోగ్యంపైనే కాకుండా, రాబోయే విద్యాసంవత్సరం నాణ్యతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి బడిబాటను జూన్ మొదటి వారం తర్వాత నిర్వహించాలని కోరుతున్నారు.
ఇటు జనగణన డ్యూటీ, అటు బడిబాట కార్యక్రమాన్ని ఒకేసారి నిర్వహించడంతో ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతున్నారు. మండుటెండలో జనగణన విధులు నిర్వహించడం కష్టంగా మారింది. ఒక్కొక్కరికీ 250 నుంచి 300 వరకు ఇండ్లను కేటాయించడంతో వారిపై తీవ్ర ఒత్తిడికి ఉంటున్నది. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉన్నందున రెండు కార్యక్రమాలు ఒకేసారి నిర్వహించడంతో కొంతమంది ఉపాధ్యాయులు అస్వస్థకు లోనవుతున్నారు. జనగణన డ్యూటీ కొనసాగుతున్న సమయంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం సమంజసం కాదు. బడిబాటను జూన్ మొదటి వారం తర్వాత నిర్వహించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విద్యాశాఖ కమిషనర్‌కు ఇటీవలే వినతి పత్రాన్ని ఇచ్చాం. ఎండలను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించాలి.
– దర్శనందేవేందర్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు, నిర్మల్