భీమారం : పాకిస్తాన్ ( Pakistan ) లోని ఉగ్ర శిబిరాల ఏరివేత కోసం భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు (Operation Sindoor) భీమారం మండల కేంద్రంలోని ఉపాధ్యాయులు ( Teachers ) సంఘీభావం తెలిపారు. వృత్యంతర శిక్షణ కేంద్రంలో ఉన్న ఉపాధ్యాయులు శనివారం జాతీయ జెండాలతో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొని అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు.
జమ్మూ,కశ్మీర్ లోని పెహల్గంలో పర్యాటకులపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర ముఠా కాల్పులకు తెగబడి 27 మందిని కాల్చి చంపడం దారుణమైన ఘటన అని ఉపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్, ఎంఈవో గోపాల్ రావు , ఎమ్మార్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.