మంచిర్యాలటౌన్, డిసెంబర్ 1: మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్ పాఠశాలలో విద్యార్థులను ఓ టీచర్ చితకబాదగా వారంతా అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరి గా చదవడం లేదన్న కారణంగా పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థులు రుషికుమార్, బ్లెస్సీ, అక్షిత్, అశ్విత్ల వీపుపై, చెంపలపై టీచర్ తీవ్రం గా కొట్టింది. ఈ ఘటన శనివారం జరుగగా ఇంటికి వెళ్లిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు వెళ్లి ఆందోళన చేపట్టారు. వీరికి పీ డీఎస్‌యూ, యూఎస్ఎఫ్ఐ సం ఘాల నాయకులు మద్దతు పలికారు. విద్యార్థులను చితకబాదిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఈవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధానకార్యదర్శి డీ శ్రీకాంత్, యూఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి పాల్గొన్నారు.