శ్రీరాంపూర్, సెప్టెంబర్ 23 : సింగరేణి లాభాల వాటాలో కోత విధించిన కాంగ్రెస్ సర్కారుపై టీబీజీకేఎస్, కార్మిక లోకం కన్నెర్ర చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం నల్లనేలపై నిరసనలతో హోరెత్తించింది. శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై టీబీజీకేఏస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు.
వాస్త వ లాభాల నుంచి రూ. 1550 కోట్ల వాటా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఎస్పార్పీ గనిపై ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్, కేంద్ర నాయకులు సాధుల భాస్కర్, తౌటి సురేశ్, వెంకట్‌రెడ్డి, గంగాధర్, సాల్మన్, సిరాజ్పాషా, గోపీనాయక్, ఆర్కే-5 గనిపై ఇన్చార్జి దుర్గం రవి, జాడి శ్రీనివాస్, పాపిరెడ్డి, రమేశ్, ఆర్కే న్యూటెక్ గనిపై ఎండా లాలా, ఉప్పాల సంపత్, ఎస్సార్పీ-1గనిపై రవిచంద్ర, వికాస్, మెడం తిరుపతి, మారం శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఓసీపీపై ఇన్చార్జి గడ్డం సుధాకర్, సారయ్య, ఐకే-1పై రత్నాకర్‌రెడ్డి, రవీమదర్, సందీప్, ఆర్కే-6గనిపై కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, కార్యదర్శి అన్వేష్‌రెడ్డి, రమేశ్, గొర్ల సంతోష్, ఆర్కే-7గనిపై ఇన్చార్జి రాజునాయక్, బిరుదు శ్రీనివాస్, కార్మికులు ఆందోళన చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ 2023-24లో వచ్చిన రూ. 4701 కోట్ల లాభాల నుం చి 33 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. సీ ఎం రేవంత్‌రెడ్డి నికర లాభాలు రూ. 4701 కోట్లు ప్రకటించి, కార్మికులకు 16.9 శాతం వాటా (రూ.796 కో ట్లు) మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ, అధికార పార్టీ సంఘం ఐఎన్టీయూసీ పట్టనట్లు వ్యవ హ రించి కార్మికులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
తాండూర్, సెప్టెంబర్ 23 : తాండూర్లోని ఏరియా స్టోర్స్ వద్ద టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధరావత్ మంగీలాల్ నేతృత్వంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. లాభాల వాటాలో కార్మికులకు అన్యాయం జరిగిందని, 33 శాతం వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేశ్, పిట్ సెక్రటరీ గణపతి పాల్గొన్నారు.
మందమర్రి, సెప్టెంబర్ 23: మందమర్రి ఏరియాలోని బొగ్గు బాయిలు, డిపార్ట్మెంట్లపై నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రాణాలకు తెగించి సింగరేణి ప్రగతికి పాటుపడుతున్న కార్మికులకు అన్యాయం చేయడం దారుణమన్నారు. ఇకనైనా సర్కారు పునరాలోచించాలని కోరారు. టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు జే.రవీందర్, కేంద్ర డిఫ్యూటీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపలి సంపత్, నాయకులు ఈశ్వర్, తోట రాజిరెడ్డి, ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాసిపేట, సెప్టెంబర్ 23 : కాసిపేట 1వ గని, కాసిపేట-2 ఇైంక్లెన్పై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాసిపేట-2గనిపై అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సారంగపాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడిన సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ సర్కారు మొండి చేయి చూపించడం దారుణమన్నారు. పోషం, వెంకటేశ్, యాదగిరి, కృష్ణ, వెంకటేశ్, ఉదయ్, తిరుపతి పాల్గొన్నారు.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 23 : పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకటరమణ,సెంట్రల్ కమిటీ సభ్యుడు దాసరి శ్రీనివాస్, జీఎం కమిటీ సభ్యుడు రాజనాల రమేశ్, నాయకులు హన్మంతరావు, మల్లయ్య, రాజన్న పాల్గొన్నారు.
రెబ్బెన, సెప్టెంబర్ 23 : ఖైర్గూడ ఓసీపీలో టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, కేంద్ర కమిటీ సభ్యులు గజెల్లి చంద్రశేఖర్, ఓరం కిరణ్ కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కారు దిగి రాకుంటే ఉద్యమంఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆందోళనలు చేపడుతాం
మందమర్రి, సెప్టెంబర్ 23 : కార్మికుల కష్టంతో గతేడాది సింగరేణికి రూ. 4701 కోట్ల లాభాలు వచ్చాయి. అందులో కోత విధించి రూ. 796 కోట్ల వాటా మాత్రమే ఇస్తామని ప్రకటించడం దారుణం. ఈ విషయంలో కాం గ్రెస్ ప్రభుత్వం, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు మాకు అన్యాయం చేశా యి. ఇకనైనా వాస్తవ లాభాల వాటాను చెల్లించాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతాం.
– ఎం.ఈశ్వర్, వర్క్‌షాప్ ఉద్యోగి, మందమర్రి
అన్యాయం చేయడం సరికాదు
మందమర్రి, సెప్టెంబర్ 23: సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాల్లో 33 శాతం వాటా చెల్లించాలి. వాస్త వ లాభాలను ప్రకటించి సంస్థ అభివృద్ధి, నూతన ప్రాజెక్టుల ఏర్పాటు పేరిట లాభాల్లో కోత విధించి మాకు అన్యాయం చేయడం సరికాదు. గత ప్రభుత్వాలు ఇలా చేయలేదు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు పునరాలోచించాలి. లేదంటే పోరాటం తప్పదు.
– కోరబోయిన లక్ష్మణ్, ఆర్కేపీ సీఎస్పీ, మందమర్రి