మందమర్రి/శ్రీరాంపూర్/కాసిపేట/రామకృష్ణాపూర్/జైపూర్/రెబ్బెన, మార్చి 28 : అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను నిరసి స్తూ, మెడికల్ బోర్డులు నిర్వహించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాల ని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ దశల వారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శనివారం సింగరేణి వ్యాప్తంగా గనులు, విభాగాలపై కార్మికులతో కలసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపింది. మందమర్రి ఏరియాలోని కేకే ఐదు, కేకేఓసీ, వర్క్‌షాప్, సివిల్ తదితర విభాగాలపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.
టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, కేంద్ర ఉపాధ్యక్షుడు రవీందర్, కేంద్ర డిఫ్యూటీ ప్రధాన కార్యదర్శి ఓరుగోండ రాజశేఖర్ మాట్లాడుతూ గతేడాది జూలై, నవంబర్ మాసాల్లో నిర్వహించిన మెడికల్ బోర్డుల్లో అర్హత కలిగి, అన్‌ఫిట్ చేయని కార్మికుల కోసం తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, అందులో భాగంగా నెలకు మూడు మె డికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక శ్రీరాంపూర్‌లోని 7 గను లు, రెండు ఓసీపీలు, డిపార్ట్మెంటులపై టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు బండిరమేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి పా ల్గొన్నారు.

Adilabad1
కాసిపేట 1 ఇైంక్లెన్ గని, కాసిపేట 2 ఇైంక్లెన్ గనులపై టీబీజీకేఎస్ ఆ ధ్వర్యంలో నిరసన చేపట్టారు. నెలకు 3 మెడికల్ బోర్డులు 100 శాతం అమలు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రామకృష్ణాపూర్‌లోని ఏరియా హా స్పిటల్, సివిల్ డిపార్ట్మెంట్లో పిట్ కార్యదర్శి దబ్బెటి సంతోశ్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జేఈ విజయ కుమార్‌కు వినతి పత్రం అందచేశారు. ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని టీబీజీకెఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ డిమాండ్ చేశారు.
శ్రీరాంపూర్ డివిజన్లో ఇందాఖని 1ఏ గనిపై టీబీజీకేఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గనిమేనేజర్కు అందించారు. బెల్లంపల్లి ఏరియాలోని గనులు, డిపార్టుమెంట్లలో సింగరేణి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, డిస్మిస్డ్ కార్మికులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.