నార్నూర్, ఆగస్టు1 : లోక్ సాహిర్, సాహిత్యవేత గొప్ప సంఘ సంస్కర్త అన్నాభావ్ సాటే అని మాతంగ్ రుషి కమిటీ అధ్యక్షుడు సూర్య వంశీ పండరి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల తాడిహత్నూర్ గ్రామంలో 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అన్న బావు సాఠే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుజనుల ఉన్నతికి కృషి చేసిన అన్న బావు సాఠే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్నా బావు సాఠే కమిటీ అధ్యక్షుడు సశాంక్, కవవలే రాజు, వామన్, అరవింద్, శివాజీ, విద్యా రాణి, గ్రామ పెద్దలు యువకులు, బహుజనులు ఉన్నారు.