తాండూర్, జనవరి 12 : మండల కేంద్రంలోని సేవాజ్యోతి శరణాలయంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాజ్యోతి విద్యార్థి సహ సేవా ప్రముఖ్ సర్వమాధవజిత్, శంకర్, శ్యాం, సాయికుమార్, లక్ష్మి, నిర్వాహకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, జనవరి 12 : పట్టణంలో నేషనల్ యూత్ డే వేడుకలను జిల్లా యువజన, క్రీడల శాఖ, యువకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాలేజ్ రోడ్లో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
లక్షెట్టిపేట, జనవరి 12: పట్టణంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌లో మున్సిపల్ చైర్మన్ కాంతయ్య వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో శివసాయి గణేశ్ సేవాసమితి అద్యక్షుడు శ్రీరామమూర్తి, పురోహితుడు వినోద్ శర్మ, ప్రధానాచార్యుడు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మార్నింగ్ వాకర్స్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు.
జన్నారం, జనవరి 12 : పొనకల్‌కు చెందిన స్నేహ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. యూత్ అధ్యక్షుడు రమేశ్, కృష్ణ, ప్రశాంత్, ప్రవీణ్, శివకుమార్,
కాసిపేట, జనవరి 12 : మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చైతన్య వేదిక అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బాపు, సలహాదారులు భీమయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, జనవరి 12: భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుని అడుగుజాడల్లో యువత నడవాలని ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అకాడమీ కో ఆర్డిటనేటర్లు గోపాల్, శ్రీలత, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లు శంకర్, రేష్మా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, సిబ్బంది ఉన్నారు.
మంచిర్యాల ఏసీసీ, జనవరి 12: మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యలో రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేశారు. బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి మధుసూదన్‌రెడ్డి, చైర్మన్ భాసర్ రెడ్డి, రక్త నిధి సిబ్బంది మణికంఠ, తిరుపతి రక్తదానం చేశారు. తలసేమియా చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. సూపర్వైజర్ మాధవి, సంధ్య, శైలజ, వీఆర్వో రాజేశ్, వేణు, కౌసల్య, లక్ష్మి పాల్గొన్నారు.