ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఎంప్లాయిస్, టీచర్స్, గజిటెడ్ ఆఫీసర్స్ అండ్ వర్కర్స్ టీజేఏసీ జిల్లా చైర్మన్ ఎస్. అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ రెవెన్యూక్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన బయోడేటా గురించి ఆరా తీశారని అనుచిత వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశ్‌రావుపై సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్, కలెక్టర్ , ఇతర అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఉద్యోగులు మనోధైర్యం కోల్పోయేలా రాజకీయ నేతలు మాట్లాడవద్దని ఉద్యోగుల, అధికారుల తరుపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. టీఎన్జీవ్సో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నవీన్ కుమార్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె. చంద్రశేఖర్, టీజీవో అసొసియేషన్ జిల్లా కార్యదర్శి కె.వనజ, ప్రభుత్వడ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సర్దార్ అలీ, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.