కుభీర్ : జీవితంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులు ( Students ) పట్టుదలతో చదవాలని నిర్మల్ జిల్లా విద్యా శాఖ అధికారి దర్శనం భోజన్న ( DEO Bhojanna) సూచించారు.
కుభీర్ ( Kubheer ) మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. రూ. 50 లక్షల నాబార్డ్ ( Nabard ) నిధులతో నిర్మించబోయే అదనపు గదుల కోసం స్థలాన్ని పరిశీలించారు. అక్కడే ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల్లో కనీస సామర్ధ్యాలను పరిశీలించారు.

Deo Visit
హాజరు రిజిస్టర్లను, స్టాక్బుక్లను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన జ్ఞాన సముపార్జన, నైపుణ్యాలను సంపాదించడంలో క్రమశిక్షణ ఎంతగానో దోహదపడుతుందని విద్యార్థులకు సూచించారు.
అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న కాంప్లెక్స్ సమావేశాలను సందర్శించారు. డీఈవో వెంట ఎంఈవో విజయ్ కుమార్, ఎస్వో వాణి, డీఈవో కార్యాలయ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.