నార్నూర్ : విద్యార్థులు తెలుగు భాషలో పట్టు సాధించడంతోపాటు క్రీడలలో ( Sports ) రాణించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాదవ్ విట్టల్( HM Jadhav Mittal ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలికల పాఠశాలలో తెలుగు భాష, క్రీడ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
తెలుగు భాష నేర్చుకుంటునే, రాష్ట్ర, జాతీయ క్రీడా పోటీలను రాణించాలని ఆకాంక్షించారు. హాకీ మాంత్రికుడు ధ్యానచంద్ క్రీడా దినోత్సవ సందర్భంగా పీడీ విశ్వనాధ్ ,తెలుగు పండితులు బి నిలయ, శంకర్‌ను శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనిత, సూరత్ సింగ్, ప్రకాష్, రాజశేఖర్, గంగ, విజయ, గీత, సరిత, విద్యార్థులు ఉన్నారు.