కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం మండల స్థాయి సీఎం కప్ ( CM Cup ) క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం లక్ష్మీ ( RatnamLaxmi ) ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడల్లో ఉన్నత శిఖరాలకు వెళ్లిన వారిని ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని, మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంఈవో ముక్తవరం వెంకటేశ్వర స్వామి, సర్పంచులు నీలా రాంచందర్, సిడం రాందాస్, ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ఉప సర్పంచ్ బూరుగుపల్లి రమేష్, సూపరిండెండెంట్ లక్ష్మయ్య, వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు.