నార్నూర్, సెప్టెంబర్ 16 : విద్యార్థులకు రుచికరమైన భోజనం వడ్డించేలా చూడాలని గాదిగూడ గిర్దావార్ తిరుపతి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జుని గిరిజన సంక్షేమ ఆశ్రమెన్నత బాలికాల పాఠశాలను సందర్శించారు. ఝరి ప్రభుత్వ దవాఖాన వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
అనంతరం వంటకాలను పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చిన్నపాటి జ్వరం వచ్చిన దవాఖానను ఆశ్రయించి చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ రాథోడ్ రవీందర్, ప్రధానోపాధ్యాయుడు శ్యాం రావు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, వైద్య సిబ్బంది ఉన్నారు.