బెల్లంపల్లి/నస్పూర్, మే 25 : రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన టీజీ ఈసెట్ ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో 1,3,4 ర్యాంకులు సాధించారు. మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో కుర్మ అక్షయ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, పిప్పాల వర్షిత్ మూడు, నడ్లకొండ మారుతి సాయి నాలుగో ర్యాంకు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్ తెలిపారు. అలాగే రోహిత్ ఏడు, అట్ల అంజన్న ఎనిమిది, ఎం.అనూష దారి 12, బొమ్మ అనిల్ 23 ర్యాంకులు సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు లెక్చరర్లు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే మంచిర్యాల విద్యార్థి సంతోష్ తెలంగాణ స్టేట్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఏడో ర్యాంకు సాధించాడు. సంతోష్ హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా పూర్తి చేశాడు. సంతోష్‌ను కుటుంబీకులు, స్నేహితులు అభినందించారు.
మాది పెద్దపల్లి పట్టణం. ఈ సెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించినందుకు ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రులు శారద, జనార్దన్, లెక్చరర్ల సహకారంతోనే ర్యాంకు సాధించాను. నా తండ్రి కారు డ్రైవరుగా పని చేస్తూ నన్ను చదివిస్తున్నాడు. ఈ ర్యాంకు సాధించినందుకు నా తండ్రి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నా. పట్టుదలతో ముందుకెళ్తే ఎవరైనా ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. కోలిండియా లిమిటెడ్‌లో మైనింగ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేయడమే నా లక్ష్యం.
మాది పెద్దపల్లి జిల్లా రామగిరి మం డలం. ఈసెట్ ఫలితాల్లో మైనింగ్ విభాగంలో మొదటి ర్యాంకు సాధిం చినందుకు ఆనందంగా ఉంది. ఈ విజయం వెనక నా తల్లిదండ్రులు లావణ్య, అనిల్ కుమార్ల ప్రోత్సా హం ఎంతగానో ఉంది. కళాశాల లోని మైనింగ్ లెక్చరర్లు అందిం చిన ఉత్తమ శిక్షణ వల్ల నేను మొదటి ర్యాంకు సాధించా ను. జాతీయ స్థాయి గేట్‌లోనూ మొదటి ర్యాంకు సాధించడం నా లక్ష్యం. ఐఐటీలో మైనింగ్ ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్యను కొనసాగిస్తా. అనం తరం సింగరేణి లేదా కోలిండియా లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో మైనిం గ్ ఇంజినీరింగ్‌లో చేరి భవిష్యత్తులో జనరల్ మేనేజర్ స్థాయి అధికారిగా ఎదగడమే నా లక్ష్యం.
మాది హన్మకొండ జిల్లా ఉప్పల్ గ్రామం. ఈసెట్ ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించినందుకు సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు అరుణ-చంద్రమోహన్. కళాశాల అధ్యాపక బృందం ప్రోద్భలంతోనే ఈ ర్యాంకు సాధించాను. లెక్చరర్ల సహకారం, సలహాలు, పాఠ్యపరమైన శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. గేట్ రాయడం ద్వారా ఐఐటీలో మైనింగ్ ఇంజినీరింగ్‌లో మెరిట్ సీటు సాధించి పీహెచ్‌డీలో ప్రవేశించడమే నా లక్ష్యం. ఎన్టీపీసీవంటి ప్రభుత్వ రంగ సంస్థలో మైనింగ్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధిస్తా.