నిర్మల్ చైన్‌గేట్, డిసెంబర్ 19 : విద్యార్థులు గణితంలో మెలకువలు సాధించి పోటీ ప్రపంచంలో ముందుండాలని ని ర్మల్ డీఈవో రవీందర్‌రెడ్డి సూచించారు. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఎస్సార్ ప్రైమ్ పాఠశాలలో మంగళవారం టీఎంఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గణిత ప్రతిభ పాట వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈవో హాజరై మా ట్లాడారు. విద్యార్థులు భావి గణిత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు చట్ల శ్రీనివాస్, మండల విద్యాధికారి కె.శంకర్, జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ పద్మ, సెక్టోరియల్ అధికారి రాజేశ్వర్, నర్సయ్య, శ్రీదేవి, జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్, ఫోరం ప్రధాన కార్యదర్శి ఎ.మనోహర్‌రెడ్డి, కోశాధికారి జి.విజయభాస్కర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి.అశోక్, రాష్ట్ర కౌన్సిలర్ ఎన్. రవిగౌడ్, పాఠశాల ప్రిన్సిపాల్ రాందాస్, ఫోరం బాధ్యులు మమత పాల్గొన్నారు.