ఎదులాపురం, జనవరి 2: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫొటోలను ముఖానికి ధరించి నిరసన తెలిపారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమ్మెలో భాగంగా నిరసన ర్యాలీ తీశారు. సీఎం, మంత్రుల ఫొటోలతో ఉన్న మాసులు ధరించి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని నినాదాలు చేశారు. రెగ్యులర్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించారని మండిపడ్డారు. 24 రోజులుగా విధులు బహిషరించి సమ్మె చేపడుతున్నామని, బోధన అందక విద్యార్థులు నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను రెగ్యులర్ చేసే వరకూ ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడల రవీందర్, జిల్లా అధ్యక్షురాలు ప్రియాంక, ప్రధాన కార్యదర్శి. ధరమ్ సింగ్, వెంకటి, పార్థసారథి, శ్రీకాంత్, ప్రవీణ్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జనవరి 2 : విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని 24 గంటల పాటు రోబోలాగా విధులు నిర్వహిస్తున్నామని తెలుపుతూ గురువారం నిర్మల్‌లో ఆర్డీవో కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ్ట ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సమగ్ర శిక్ష ఉద్యోగికి ముఖాముఖిగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న 20 ప్రశ్నలపై చర్చా గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగాధర్, రాజారత్నం, నరేశ్, తిరుపతి, నవిత, వీణా, అపర్ణ, పుష్పలత, రాధిక, శ్రీలత, గంగామణి, ప్రభ, సునీత తదితరులు పాల్గొన్నారు.
దీక్ష శిబిరంలో మామడ మండల కేజీబీవీ సీఆర్టీ ఉపాధ్యాయురాలు పద్మ సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన తోటి ఉపాధ్యాయులు ఆమెను హుటాహుటిన నిర్మల్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. సమ్మెలో పాల్గొంటున్న ఉపాధ్యాయుల ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.