ఉట్నూర్/ఇచ్చోడ/ఇంద్ర వెల్లి/బజార్ హత్నూర్/ ఉట్నూర్ రూరల్, మే 18 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవె ల్లి, బజార్హత్నూర్, ఇచ్చో డ, ఉట్నూర్ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టిం చింది. ఇండ్ల రేకులు ఊడి పోగా.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కల్లాల్లో ఆర బోసిన పంట ఉత్ప త్తులు తడిసిముద్దయ్యాయి. పలు లోతట్టు ప్రాం తాలు జలమయం అయ్యాయి. ఇంద్రవెల్లి మండలంలోని వాల్గొండా, వడగామ్, తేజాపూర్, సాలేగూడ, మోహన్సింగ్తండా, దస్నాపూర్, దోభిగూడ, గౌరాపూర్, పోల్లుగూడ, పాకిడిగూడ గ్రామాల్లో ఈదురు గాలులతోపాటు వడగాండ్ల వర్షం కురిసింది. మోహన్సింగ్తండా, వడగామ్, వాల్గొండా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.
సాలేగూడ, వడగామ్, వాల్గోండా, పాకిడిగూడ గ్రామాల్లో పలువురి ఇండ్ల పైకప్పులు ఊడిపోయాయి. నిత్యావసర సరుకులతోపాటు విలు వైన సామగ్రి తడిసిపోయి నష్టం వాటిల్లింది. బజార్హత్నూర్ మండల కేంద్రంలో ఏకధాటిగా 15 నిమిషాలు వర్షం కురవడంతో మార్కెట్ యార్డు బయట కుప్పలుగా ఉంచిన జొన్నలు తడిచి ముద్దయ్యాయి. దీంతో రైతులు టార్పాలిన్లు కప్పారు. ఇచ్చోడ మండలంలోని అడిగామ నుంచి పిప్పిరి గ్రామానికి వెళ్లే రోడ్డు పై చెట్టు విరిగి పడింది.
ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాల్లో వర్షం కురియడంతో రైతు లు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతమైన అంబేద్కర్ చౌక్‌లోని పలు కాంప్లెక్స్‌లు, కళాశాల భవనా లలోకి నీరు చేరింది. పెర్కగూడ ప్రధాన రహదారిపై చెట్టు పడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఉట్నూర్ మండలంలోని గంగన్నపేట్, బిర్సాయిపేట్ గ్రామాల్లో ధాన్యం తడిసింది. కోత కొచ్చిన వరి నేల కొరిగింది. శ్యాంపూర్ గ్రామంలో భారీ గాలికి కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. రేకుల ఇండ్ల పైకప్పులు గాలికి లేచి పోయాయి.